తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీలపై పలు ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో అర్హతలేని ఫ్యాకల్టీ నియామకం, తక్కువ జీతాలు ఇవ్వడం వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఫీ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా కాలేజీలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే హైకోర్టు తాత్కాలికంగా కాలేజీలకు ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఫైనల్ తీర్పు తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని సూచించింది.
ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ తనిఖీలు కఠినంగా నిర్వహించి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.
#EngineeringColleges
#tgcm
#education



